ఏటా గల గలా పారేటి గంగమ్మ తల్లి.. ఈఏడాది నీరు లేక వెలవెలబోతోంది. మండలంలోని కందకుర్తి వద్ద గోదావరి, హరిద్రా, మంజీరా నదులు ఒకేచోట కలిసే త్రివేణి సంగమ క్షేత్రం చుక్క నీరు లేక బీటలువారి నల్లమట్టి దర్శనమిస్తున్నది. భానుడి ప్రతాపానికి రానున్న రోజుల్లో మూగ జీవాల దాహార్తిని తీర్చడం ప్రశ్నార్థకంగా మారే ప్రమాదం ఉందని రైతులు ఆందోళన చెందుతున్నారు.
-రెంజల్, మే 12