Nizamabad | నిజామాబాద్ : రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్రంలో ఉన్న బీసీ లందరికీ ఆశలు కల్పించి నయవంచనకు గురి చేశాడని మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి మండిపడ్డారు. ఈ మేరకు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కామారెడ్డి డిక్లరేషన్ లో బీసీ లకు 42 శాతం రిజర్వేషన్ లు కల్పిస్తామని చెప్పి ఎన్నికలప్పుడు బీసీ ల ఓట్లు దండుకొని ఇప్పుడు చేతులెత్తేశాడని మండిపడ్డాడన్నారు.
రాజ్యాంగ సవరణ ద్వారానే బీసీ రిజర్వేషన్ లు సాధ్యమౌతాయని తెలిసి కూడా బీసీ లను ఓట్ల కోసం రేవంత్ రెడ్డి మభ్యపెట్టాడన్నారు. కానీ రేవంత్ రెడ్డి బీజేపీ పార్టీ ని నిలదీయకుండా, కేంద్రంపై పోరాటం చేయకుండా ఇక్కడ జీవోల పేరుతో అసెంబ్లీలో తీర్మానం అని ఒకసారి, ఆర్డినెన్స్ అని పూటకో డ్రామాలాడాడని విమర్శించారు. ఇప్పుడు ఎన్నికలు వస్తున్నాయని, బీసీ ల ఆగ్రహానికి గురి కావాల్సి వస్తుందని కేంద్రం పై కోర్టులపై నెపం నెట్టి తప్పించుకోవాలని చూస్తున్నాడని మండిపడ్డారు.
బీసీ లకు రిజర్వేషన్ లు చేయిస్తామని, కాంగ్రెస్ మాట ఇచ్చింది రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ కావున ఈ రెండు పార్టీలు కలిసి బీసీలను మోసం చేశాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలోని బీసీలు అన్ని గమనిస్తున్నారని, సమయం వచ్చినప్పుడు రెండు పార్టీలకు తగిన గుణపాఠం చెబుతారని చెప్పారు.