నమస్తే తెలంగాణ యంత్రాంగం, ఏప్రిల్ 13 : తెలంగాణలోని రైతులు యాసంగిలో సాగుచేసిన వడ్లను కొనుగోలు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ఇబ్బందులకు గురిచేస్తుండడంతో, ధాన్యం మొత్తాన్ని రాష్ట్రప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని సీఎం కేసీఆర్ ప్రకటించడంపై రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలోని అన్ని మండలాలు, గ్రామాల్లో రైతులు, నాయకులు సీఎం కేసీఆర్, ఎమ్మెల్యేల చిత్రపటాలకు బుధవారం క్షీరాభిషేకం చేశారు. క్వింటాలు ధాన్యాన్ని రూ.1,960కి కొనుగోలు చేస్తామని భరోసా ఇవ్వడంపై పటాకులు కాల్చి, స్వీట్లను పంచుకొని హర్షం వ్యక్తం చేశారు.