UREA | నందిపేట : నిజామాబాద్ జిల్లా నందిపేట మండల కేంద్రంలో యూరియా కోసం రైతులు రోడ్డు ఎక్కారు. రోజులు గడుస్తున్నా తమకు సమయానికి యూరియా అందడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తూ రోడ్డుపై బైఠాయించి ధర్నా చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత యూరియా కోసం తీవ్రమైన తిప్పలు పడుతున్నామని రైతులు ఆందోళన వ్యక్తం చేశారు.
యాప్ లో యూరియా బుకింగ్ వ్యవహారం తీవ్రంగా ఇక్కట్లకు గురి చేస్తోందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. రైతుల రాస్తారోకో విషయాన్ని తెలుసుకున్న పోలీసులు వెంటనే అన్నదాతలను సముదాయించి ఆందోళన విరమింపజేశారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ యాప్‌తో తీవ్ర ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి యూరియాను అందుబాటులోకి తీసుకురావాలని డిమాండ్ చేశారు.