మాచారెడ్డి, డిసెంబర్ 1 : ధాన్యం కాంటా చేసినా మిల్లులకు తరలించకపోవడంతో రైతులు సోమవారం నిరసనకు దిగారు. కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలంలోని అక్కాపూర్ రైతులు కొనుగోలు కేంద్రంలో ధాన్యం కాంటా చేశారని, మిల్లులకు తరలిచేందుకు లారీలు మాత్రం రావడం లేదని రైతులు తెలిపారు.
ధాన్యంలో మొలకలు వస్తున్నాయని, అధికారులకు ఎన్నిసార్లు విన్నవించినా పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. రానున్న రెండు రోజుల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు సూచిస్తున్నారని, వెంటనే లారీలు పంపి మొత్తం ధాన్యాన్ని మిల్లులకు తరలించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో రైతులు కాంతయ్య, లక్ష్మీనర్సు, లింగం తదితరులు పాల్గొన్నారు.