Chandur | చందూరు : చందూరు మండల కేంద్రంతో పాటు పలు గ్రామాల్లో ఇటీవల వర్షాలు కురవడంతో రైతన్నలు తమ వ్యవసాయ క్షేత్రాలు హుషారుగా నారుమడులను తయారుచేసి జోరుగా వరి నాట్లు వేశారు. గత వారం రోజులుగా అడపాదడపా వర్షం కురుస్తూ ఎండలు మండుతుంటే బోరు బావుల్లో నీరు లేక వేసిన వరి నాట్లు కోలుకోలేక కొందరు రైతన్నలు బోరున విలపిస్తున్నారు.
మరికొందరు రైతన్నలు తమ నారుమడులు ముదిరిపోతున్నా నాట్లు వేయలేక పోతున్నారు. వర్షాలు కురవాలని వరుణుడి కోసం అన్నదాతలు ఎదురుచూస్తున్నారు. గ్రామాల్లో గంగాజలాలతో నిత్యం గ్రామదేవతలకు జలాభిషేకం చేస్తున్నారు. ఆలయాల్లో వర్షాలు సమృద్ధిగా కురవాలని ప్రత్యేక పూజలు చేస్తున్నారు.