సెప్టెంబర్ నుంచి రంగంలోకి?
కాకినాడ పోర్ట్‌లో ‘ఎన్బీకే 111’(వర్కింగ్ టైటిల్) షూటింగ్ జరుగుతుండగా అగ్ర కథానాయకుడు బాలకృష్ణ ప్రమాదానికి గురై, గాయాలపాలైన విషయం తెలిసిందే. ఆయన మోకాలి శస్త్రచికిత్స విజయవంతం అయినట్టు వైద్యులు కూడా ప్రకటించారు.
కాకినాడ పోర్ట్‌లో ‘ఎన్బీకే 111’(వర్కింగ్ టైటిల్) షూటింగ్ జరుగుతుండగా అగ్ర కథానాయకుడు బాలకృష్ణ ప్రమాదానికి గురై, గాయాలపాలైన విషయం తెలిసిందే. ఆయన మోకాలి శస్త్రచికిత్స విజయవంతం అయినట్టు వైద్యులు కూడా ప్రకటించారు. ప్రస్తుతం బాలయ్య షూటింగులకు దూరంగా విశ్రాంతి తీసుకుంటున్నారు. ఈ కారణంగా ఆయన చేస్తున్న రెండు సినిమాల షెడ్యూల్స్ అనూహ్యంగా మారిపోయాయి.
ఇప్పటికే ‘ఎన్బీకే 111’ షూటింగ్ చాలావరకూ పూర్తయింది. షూటింగ్ సజావుగా సాగితే ఈ దసరాకే సినిమాను విడుదల చేయాలనుకున్నారు. కానీ వైద్యులు బాలకృష్ణకు ఆరువారాల విశ్రాంతి సూచించడంతో షూటింగ్ వాయిదా పడింది.
తాజా సమాచారం ప్రకారం బాలకృష్ణ గ్రీన్‌సిగ్నల్ ఇవ్వడంతో సెప్టెంబర్ రెండో వారం నుంచి ఈ సినిమా షూటింగ్ మొదలుకానున్నట్టు తెలిసింది. మలినేని గోపీచంద్ దర్శకత్వంలో వెంకటసతీశ్ కిలారు నిర్మిస్తున్న ఈ సినిమా సమ్మర్లో విడుదల కానున్నట్టు సమాచారం. కొరటాల శివ, బాలకృష్ణ కాంబినేషన్ సినిమా విషయానికొస్తే..బాలకృష్ణ లేని సన్నివేశాలతో కొరటాల ఓ షెడ్యూల్‌ని ప్లాన్ చేశారట. ఈ లోపు ఆ షెడ్యూల్‌ని కొరటాల పూర్తి చేస్తారని వినికిడి.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
AH Movie | ‘అ’ ఒక సరికొత్త మిస్టరీ థ్రిల్లర్: ప్రేక్షకులను ఉత్కంఠకు గురిచేయడం ఖాయమన్న హీరో రాహుల్ విజయ్!
Moinabad | డ్రగ్స్ తరలిస్తున్న ఇద్దరు అరెస్ట్.. 2 లక్షల విలువైన ఎండీఎంఏ స్వాధీనం..!
Karepalli | కారేపల్లి మండలంలో ఘనంగా ‘ఎంగిలిపూల బతుకమ్మ’ వేడుకలు..!
Hanumakonda | విజయ డెయిరీ అభివృద్ధి కోసం రూ.1.85 కోట్ల నిధులు మంజూరు..!
KTR | తెలంగాణ ఉద్యమకారుడి కుటుంబానికి అండగా కేటీఆర్.. 10 లక్షల ఆర్థిక సాయం అందజేత..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

