మాక్లూర్/బోధన్ రూరల్, ఫిబ్రవరి 11: యూరి యా కోసం రైతులకు తిప్పలు తప్పడం లేదు. బుధవారం బోధన్ మండలంలోని ఊట్పల్లిలో యూరియా కోసం ఉదయం నుంచే రైతులు గోదాం వద్ద పడిగాపులు కాశారు. అటు సాలూర సొసైటీ వద్ద కూడా రైతులు బారులు తీరారు. చుట్టు పక్కల సొసైటీల్లో యూరియా కొరత ఏర్పడగా, ఫర్టిలైజర్ యాప్లో సాలూర సొసైటీలో యూరియా స్టాక్ ఉన్నదని చూపించడంతో రైతులంతా తరలివచ్చారు. మాక్లూర్ మండలంలోని కల్లడి సొసైటీ వద్ద రైతులు పొద్దంతా పడిగాపులు కాశారు. ‘యాప్’ ద్వారా యూరియా బుక్ కావడం లేదని, ఆ దిక్కు మాలిన యాప్ మాకొద్దంటూ పీఏసీఎస్ కార్యాలయం ఎదుట రైతులు నిరసన తెలిపారు. యూరియా బస్తాలు ఉన్నట్లు యాప్లో చూపెడుతున్నా, బుకింగ్ మాత్రం కావడం లేదన్నారు.