Environment | శక్కర్ నగర్ : పర్యావరణ పరిరక్షణలో భాగంగా ప్రతీ ఒక్కరూ బాధ్యతగా మొక్కలు నాటాలని బోధన్ ట్రాఫిక్ సీఐ చందర్ రాథోడ్ సూచించారు. బోధన్ పట్టణంలోని ఆర్టీసీ డిపోకు వెళ్లే రహదారి పక్కన ఆయన సిబ్బందితో కలిసి పలు రకాల మొక్కలను సోమవారం నాటారు. వేసవికాలంలో సేద తీర్చుకునేందుకు మొక్కలు పెద్దవిగా మారి ఎంతో ఆసరాగా మారుతాయని అన్నారు.
ప్రజలు తమకు చెందిన ఖాళీ స్థలాలతో పాటు, పరిసర ప్రాంతాల్లోని ఖాళీ స్థలాల్లో మొక్కలు నాటి వాటి సంరక్షణ చర్యలు చేపట్టాలన్నారు. అదేవిధంగా నాటిన ప్రతీ ఒక్క ఎదిగేంతవరకు బాధ్యత వహించాలని ఆయన సూచించారు. బోధన్ పట్టణంలో పలుచోట్ల ఖాళీ ప్రదేశాలు ఉన్నాయని, ఈ ప్రదేశాల్లో యువత తో పాటు ఆసక్తి కలిగిన ప్రజలు విరివిగా మొక్కలు నాటాలని సీఐ సూచించారు. ట్రాఫిక్ విధుల నిర్వహణతో పాటు నిత్యం కొన్ని మొక్కలు నాటాలని సంకల్పించినట్లు సీఐ చందర్ రాథోడ్ తెలిపారు.
పర్యావరణం కాలుష్యం అవతల సందర్భంగా పరిరక్షణ కోసం వివిధ రకాల మొక్కలను నాటాలని సీఐ ప్రజలను కోరారు. ప్రతీ ఉద్యోగి, వ్యక్తి నిత్యజీవితంలో కొనసాగించే విధులతో పాటు మొక్కలు నాటాలని సంకల్పం తీసుకొని చర్యలు చేపట్టాలని ఆయన యువతను, ఉద్యోగులను, ప్రజలను కోరారు. ఈ సందర్భంగా ట్రాఫిక్ సీఐ చందర్ రాథోడ్ మొక్కలు నాటాడంపై పలువురు వర్షం వ్యక్తం చేశారు.