రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారం కార్యక్రమంతో ఉమ్మడి జిల్లాలోని ప్రతి గ్రామం పచ్చదనంతో కళకళలాడుతున్నది. విరివిగా మొక్కలు నాటడంతో అవి వృక్షాలుగా ఎదిగి చల్లని నీడనిస్తున్నాయి.
కామారెడ్డి నుంచి గాంధారి, మాక్లూర్ నుంచి నందిపేట్, వేల్పూర్, ఇందల్వాయి ప్రాంతాలకు వెళ్లే మార్గంలో పచ్చని చెట్లు స్వాగత తోరణంలా వాహనదారులకు ఆహ్లాదం పంచుతున్నాయి. ప్రస్తుతం ఎండలు దంచికొడుతుండడంతో చెట్లకింద సేదతీరుతున్నారు.
-స్టాఫ్ ఫొటోగ్రాఫర్, నిజామాబాద్