ఖలీల్వాడి/ కామారెడ్డి, మార్చి 20 : ఉమ్మడి జిల్లాలో ఇంటర్ ద్వితీయ సంవత్సరం పరీక్షలు గురువారం ముగిశాయి. ఒకేషనల్ బ్రిడ్జి కోర్సు పరీక్షలు ఈ నెల 22న ముగుస్తాయని నిజామాబాద్ జిల్లా ఇంటర్ విద్యాధికారి రవికుమార్ తెలిపారు.
చివరి రోజు కెమిస్ట్రీ, కామర్స్ పరీక్షలు ప్రశాంతంగా జరిగాయని పేర్కొన్నారు. జిల్లా వ్యాప్తంగా 15,896 మంది విద్యార్థులకు 15,458 మంది హాజరుకాగా, 438 మంది గైర్హాజరైనట్లు తెలిపారు. కామారెడ్డి జిల్లాలోజనరల్ 6,928 మంది విద్యార్థులకు 6,780 మంది హాజరుకాగా, 148 మంది గైర్హాజరైనట్లు ఇంటర్ నోడల్ అధికారి షేక్ సలాం తెలిపారు. ఒకేషనల్ 1,093 మంది విద్యార్థులకు 1,042 మంది హాజరుకాగా, 51 మంది గైర్హాజరైనట్లు పేర్కొన్నారు.