బాన్సువాడ రూరల్ : బాన్సువాడ మండలంలోని వివిధ గ్రామాలలో ఉపాధి హామీ పనులు (Employment guarantee Scheme) ఊపందుకున్నాయి. ప్రస్తుతం వ్యవసాయ పనులు తక్కువగా ఉండడంతో ఉపాధి హామీ పనులు చేసేందుకు కూలీలు తరలివస్తున్నారు. బోర్లం, హన్మాజీ పేట్, ఇబ్రహీంపేట్, కోనాపూర్ ( Konapur ) , తాడ్కోలు గ్రామాలల్లో సోమవారం ఉపాధి హామీ పనులకు కూలీలు తరలివచ్చారు.
ఉపాధి హామీ పనులలో సీసీటీలు, ఫీల్డ్ ఛానల్లో పూడికతీత తదితర పనులు చేపడుతున్నారు. కూలీలకు కూలి గిట్టుబాటు అయ్యేవిధంగా క్షేత్ర సహాయకులు కూలీలకు కొలతలు ఇచ్చి పనులు చేయిస్తున్నారు. జిల్లాలో ప్రతి గ్రామంలో ఉపాధి పనులు ప్రారంభించాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ ( Ashish Sangwan ) ఆదేశించడంతో ఉపాధిహామీ అధికారులు ప్రత్యేక ప్రణాళికలతో పనులు చేపట్టారు.
ఈ సందర్భంగా ఏపీవో బిక్షపతి మాట్లాడుతూ పని అడిగిన ప్రతికూలికి పనులు కల్పించేందుకు కావలసిన పనులు సిద్ధంగా ఉన్నాయని తెలిపారు. గ్రామాల వారీగా కూలీల డిమాండ్ కు అనుగుణంగా పనులు గుర్తించి పనులు కల్పిస్తున్నామని ఆయన తెలిపారు. పనులకు వచ్చేందుకు కూలీలు దరఖాస్తు చేసుకోవాలని ఆయన సూచించారు.
,