Nizamabad | కోటగిరి : ఎన్నికల సమయంలో తెలంగాణ ప్రజలకు హామీలు ఇచ్చి గద్దెనెక్కిన తర్వాత హామీలను పూర్తి గా సీఎం రేవంత్ రెడ్డి విస్మరించారని.. వద్దురా నాయన ఈ కాంగ్రెస్ పాలన అని పలువురు ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా కోటగిరి బీజేపీ మండల అధ్యక్షుడు ఏముల నవీన్ మాట్లాడుతూ రైతులకు ఇస్తామన్న బోనస్ వెంటనే చెల్లించాలని, రెండు లక్షల పైన ఉన్న రుణం మాపీ చేయాలని డిమాండ్ చేశారు.
కౌలు రైతుకు రైతు భరోసా చెల్లించాలని కోరారు. వానాకాలం సీజన్ ప్రారంభం అయినా కూడా ఇంత వరకు రైతు భరోసా ఇవ్వలేదని మండి పడ్డారు. ప్రజలకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. సీఎం డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. ఈ కార్యక్రమం లో నాయకులు మామిడి శ్రీనివాస్, మామిడి సతీష్, సాయి, నాగేలి శ్రీనివాస్, హౌగి రావు దేశాయ్, శ్యామల, జగదీష్ దావులయ్య తదితరులు పాల్గొన్నారు.