మాటిచ్చిన.. నీళ్లు తెచ్చిన
‘గత ఎన్నికల సమయంలో సాగు నీటి ఇబ్బందుల కారణంగా ఉప్లూర్ రైతులు తనను కోపగించుకున్నారు..అప్పుడే ఉప్లూర్ బాల రాజేశుడి ఆలయం ఎదుట ప్రమాణం చేసి చెప్పాను..చెప్పిన విధంగా ఎస్సారెస్పీ వరద కాలువను..
- ‘భగీరథ’ ఫలితాలకు నిదర్శనం ఉప్లూర్
- కాంగ్రెస్‌కు 11 సార్లు చాన్స్ ఇచ్చాం..
- మళ్లీ ఒక్క అవకాశం ఇవ్వాలని ఆ పార్టీ అడగడం విడ్డూరం
- బాల్కొండ నియోజకవర్గ బీఆర్ఎస్ అభ్యర్థి, మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి
- కమ్మర్పల్లి మండలంలో ఎన్నికల ప్రచారం
కమ్మర్పల్లి, నవంబర్ 14 : ‘గత ఎన్నికల సమయంలో సాగు నీటి ఇబ్బందుల కారణంగా ఉప్లూర్ రైతులు తనను కోపగించుకున్నారు..అప్పుడే ఉప్లూర్ బాల రాజేశుడి ఆలయం ఎదుట ప్రమాణం చేసి చెప్పాను..చెప్పిన విధంగా ఎస్సారెస్పీ వరద కాలువను..కాకతీయ కాలువను మూడు కాలాలు నిండుగా ఉంచుతూ రెండు పంటలకు సాగు నీటి సౌకర్యాన్ని శాశ్వతంగా కల్పించాను’ అని బాల్కొండ నియోజకవర్గ బీఆర్ఎస్ అభ్యర్థి, మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి అన్నారు. దీనిని రైతులు, ప్రజలు గుర్తించి తనను మళ్లీ ఆశీర్వదించాలని కోరారు.మంగళవారం సాయంత్రం ఆయన కమ్మర్పల్లి మండల కేంద్రంతోపాటు నాగాపూర్, ఉప్లూర్ గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
కాంగ్రెస్ పార్టీకి ప్రజలు 11 సార్లు అవకాశం ఇచ్చినా ఏమి చేయ లేదన్నారు. మళ్లీ ఒక చాన్స్ ఇవ్వాలని కాంగ్రెస్ అడగడం విడ్డూరంగా ఉందన్నారు. మిషన్ భగీరథ ఫలితాలకు ఉప్లూర్ గ్రామం చక్కని నిదర్శనమని పేర్కొన్నారు. రూ.3 కోట్లతో మిషన్ భగీరథ కింద ఉప్లూర్ మహిళల తాగునీటి ఇబ్బందులు శాశ్వతంగా దూరం చేశామని చెప్పారు. కమ్మర్పల్లి మండల కేంద్రంలో సెంట్రల్ లైటింగ్, నాలుగు లైన్ల రోడ్డు అభివృద్ధికి తార్కాణమని పేర్కొన్నారు.మినీ స్టేడియం నిర్మించి యువత దశాబ్దాల కల నెరవేర్చినట్లు తెలిపారు. కారు గుర్తుకు ఓటు వేసి కేసీఆర్‌ను మళ్లీ ముఖ్యమంత్రిని చేయాలని, తనను మరో సారి గెలిపించాలని వేముల కోరారు.
Read Today's Latest Nizamabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Karthik Subbaraj | చిరంజీవి గారికి కథ చెప్పాను.. ఇంకా ఫైనలైజ్ కాలేదు: డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజ్
ఆడపడుచుల ఆత్మగౌరవం.. ప్రకృతి ప్రేమకు ప్రతీక బతుకమ్మ : పద్మా దేవేందర్ రెడ్డి
Crops | ట్యాంకర్లతో నీటి కొనుగోలు.. అయినా తీరని సాగునీటి కష్టాలు
Chiranjeevi | ‘జైలర్ 2’ సినిమాటోగ్రాఫర్‌కు చిరంజీవి అభినందనలు.. ‘కాకా’ సెట్స్‌లో ప్రత్యేక వేడుక!
Madhya Pradesh | మధ్యప్రదేశ్‌లో భక్తులపై దూసుకెళ్లిన భారీ ట్రక్కు 12 మంది మృతి.. పలువురికి తీవ్ర గాయాలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

