Nizamabad | కోటగిరి : జమ్మూ కాశ్మీర్ లోని పహాల్ గామ్ లో టూరిస్టులను హతమార్చిన ఉగ్రవాదులను పట్టుకొని ఉరిశిక్ష విధించాలని కోటగిరి గ్రామస్తులు డిమాండ్ చేశారు. కోటగిరి మండల కేంద్రంలో అంబేద్కర్ చౌరస్తా వద్ద దాడికి నిరసనగా ఉగ్రవాదుల దిష్టిబొమ్మను గురువారం దగ్ధం చేశారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ ఉగ్ర కలా పాలను పూర్తిగా నిర్మూలించేందుకు కేంద్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.
ఉగ్రవాదుల దాడిలో మరణించిన వారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని అన్నారు. ఈ కార్యక్రమంలో పుల్లెల మోహన్ రావు, ఏముల నవీన్. మామిడి శ్రీనివాస్, రాజు, వడ్ల శ్యామ్, సుభాష్, దావులయ్య, జుబేర్, సమీర్, జమిల్ బాబూఖాన్ తదితరులు పాల్గొన్నారు.