ప్రభుత్వం పాఠశాలలకు ఆదివారం నుంచి దసరా పండుగ సెలవులను ప్రకటించింది. హాస్టళ్లలో ఉంటున్న విద్యార్థులు శనివారం ఇంటి బాట పట్టారు. పెట్టె సర్దుకొని సొంతూళ్లకు పయణమయ్యారు.
బస్టాండ్లన్నీ రద్దీగా మారాయి. బస్సులు కిక్కిరిసి పోయాయి. బస్సులో సీటు కోసం పడరాని పాట్లు పడ్డారు. సరిపడా బస్సులు లేవని పలువురు ప్రయాణికులు విమర్శించారు.