బాన్సువాడ : బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో తెలంగాణలో ఎక్కడా లేని విధంగా బాన్సువాడ నియోజకవర్గంలో 11 వేల డబుల్ బెడ్ రూం ఇండ్లను నిర్మించామని ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి (MLA Pocharam Srinivas Reddy ) తెలిపారు. సోమవారం నియోజకవర్గంలోని నాగారం గ్రామంలో ఇందిరమ్మ ఇండ్లకు భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు.
ప్రభుత్వం రాష్ట్రంలో 4 లక్షల 50 వేల ఇండ్లు మంజూరు చేసిందన్నారు. ఇల్లులేని పేదవారిని గుర్తించి ఒక్కో ఇంటికి రూ. 5 లక్షలు మంజూరు చేస్తుందని అన్నారు. నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ ( KCR ) తో ఉన్న సాన్నిహిత్యం వల్ల 11 వేల డబుల్ బెడ్ ఇండ్లను ( Double Bed Rooms) నిర్మించుకుని తెలంగాణలో ఆదర్శంగా నిలిచామని పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ ఇచ్చే రూ. 5లక్షలలో తిరిగి ప్రభుత్వానికి కట్టవలసింది ఏమీ లేదని అన్నారు.
ఈ కార్యక్రమంలో సబ్ కలెక్టర్ కిరణ్మయి, రాష్ట్ర వ్యవసాయ ఆగ్రో ఇండస్ట్రీస్ కార్పొరేషన్ చైర్మన్ కాసుల బాలరాజు, హోసింగ్ ఈఈ విజయపాల్ రెడ్డి , తహసీల్దార్ వరప్రసాద్, ఎంపీవో సత్యనారాయణ రెడ్డి, ఎంపీడీవో బషీరొద్దీన్, నాయకులు అంజిరెడ్డి, నార్ల సురేష్ గుప్తా, మోహన్ నాయక్, పరిగే మోహన్ రెడ్డి, రాచప్ప, సాయిగొండ, మారుతి, బలరామ్ యాదవ్, తదితరులు ఉన్నారు.