వానకాలం ప్రారంభమై నెలరోజులు గడుస్తున్నా వర్షాలు సమృద్ధిగా కురవకపోవడంతో భూగర్భ జలాలు అడుగంటి పోయాయి. దీంతో బోరుబావుల నుంచి నీళ్లు రాక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అందుకు నిదర్శనమే మాక్లూర్ మండలం మదనపల్లి గ్రామానికి చెందిన రైతు రాజన్న పొలంలోని బోరు బావి దృశ్యాలు. తన పొలంలోని రెండుబోర్లు కాసేపు ఆగుతూ..మరికాసేపు నీళ్లు పారుతున్నాయని చెబుతున్నాడు. దేవుడిపై భారం వేసి నాలుగు ఎకరాల భూమిలో నాటు వేశానని, ఇప్పటి వరకు సరైన వర్షాలు లేక బోర్లు సరిగా పారడం లేదని ఆవేదన వ్యక్తం చేశాడు.