కోటగిరి : వైద్యో నారాయణో హరి.. అంటే వైద్యుడు దేవుడితో సమానమని, వైద్యుడు అంటే కనిపించే దేవుడని కోటగిరి లయన్స్ క్లబ్ అధ్యక్షుడు పత్తి లక్ష్మణ్ అన్నారు. మంగళవారం డాక్టర్స్ డే సందర్భంగా కోటగిరి లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో స్థానిక కమ్యూనిటీ హెల్త్ సెంటర్ వైద్యురాలు సుప్రియను శాలువా కప్పి పూలమాలతో ఘనంగా సత్కరించారు.
ఈ సందర్భంగా లయన్స్ క్లబ్ అధ్యక్షులు పత్తి లక్ష్మణ్ మాట్లాడుతూ.. వైద్యవృత్తి చాలా పవిత్రమైనదని కొనియాడారు. ఆ సర్కారు దవాఖానలో ఉన్న రోగులకు పండ్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో లయన్స్ క్లబ్ ప్రధాన కార్యదర్శి శ్రీనివాసరావు, కోశాధికారి గోగినేని హనుమంతరావు, ఉపాధ్యక్షులు పీ అనిల్ కుమార్, పోలా అశ్విన్ కుమార్, జాయింట్ సెక్రెటరీ నిశాంత్, జానకిరావు, కూచి సిద్ధయ్య, తరుణ్ సాయి తేజ, పీ సతీష్, ఉదయ్ భాస్కర్ తదితరులు ఉన్నారు.