వేల్పూర్, సెప్టెంబర్ 15: నియోజకవర్గంలో చేపడుతున్న అభివృద్ధి పనులతోపాటు అన్ని వర్గాల ప్రజల సంక్షేమానికి కృషి చేస్తున్న మంత్రి ప్రశాంత్‌రెడ్డిని వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యేగా మూడో సారి భారీ మెజార్టీతో గెలిపించాలని ఆపార్టీ నాయకులు కోరారు. సీఎం కేసీఆర్ సర్కారు చేపడుతున్న అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాలను వివరిస్తూ ఇంటింటికీ బీఆర్ఎస్ కార్యక్రమాన్ని శుక్రవారం నియోజకవర్గంలో ఆపార్టీ నాయకులు ప్రారంభించారు.
వేల్పూర్ మండలంలోని వివిధ గ్రామాల్లో బీఆర్ఎస్ నాయకులు ఇంటింటికీ తిరుగుతూ ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. వేల్పూర్‌లో నిర్వహించిన కార్యక్రమంలో బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు కోటపాటి నర్సింహానాయుడు పాల్గొని మాట్లాడారు. దేశంలో ఎక్కడా లేని విధంగా పేదలకు సంక్షేమ పథకాలను రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్నదని అన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించారు. మండలంలోని కుక్నూర్, కోమన్‌పల్లి, వెంకటాపూర్ గ్రామాల్లో బీఆర్ఎస్ నాయకులు ఇంటింటికీ తిరుగుతూ సంక్షేమ పథకాలను వివరించారు. ఆయా గ్రామాల్లో నిర్వహించిన కార్యక్రమాల్లో ఆర్టీఏ సభ్యుడు రేగుల్ల రాములు, కోర్ కమిటీ సభ్యుడు, రైతు బంధు సమితి జిల్లా సభ్యుడు మిట్టపల్లి మహిపాల్, వైస్ ఎంపీపీ సురేశ్, సర్పంచ్ లింబాద్రి, గ్రామశాఖ అధ్యక్షుడు రాజశేఖర్‌గౌడ్, పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు కార్యక్రమాన్ని ప్రారంభించారు.
భీమ్‌గల్ మండలం, పట్టణంలో..
భీమ్‌గల్,సెప్టెంబర్ 15: భీమ్‌గల్ పట్టణంలోని ఒకటో వార్డులో మున్సిపల్ చైర్పర్సన్ కన్నెప్రేమలతా సురేందర్, మండలంలోని పిప్రిలో పార్టీ మండల అధ్యక్షుడు దొన్కంటి నర్సయ్య కార్యక్రమాన్ని ప్రారంభించారు. సీఎం కేపీఆర్, మంత్రి వేములకు అండగా ఉంటామంటూ ప్రజలు చెబుతున్నారని వారు అన్నారు. కార్యక్రమంలో అన్ని గ్రామాల సర్పంచులు, కౌన్సిలర్లు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
బాల్కొండ మండలంలో..
బాల్కొండ, సెప్టెంబర్ 15: మండలంలోని వివిధ గ్రామాల్లో బీఆర్ఎస్ నాయకులు ఇంటింటికీ తిరుగుతూ ప్రభుత్వం అములు చేస్తున్న సంక్షేమ పథకాలను వివరించారు. బీఆర్ఎస్ అభ్యర్థి వేములను మళ్లీ భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో ఎంపీపీ లింగాగౌడ్, పార్టీ మండల అధ్యక్షుడు బద్దం ప్రవీణ్‌రెడ్డి, పట్టణ అధ్యక్షుడు సాగర్ యాదవ్, వార్డు మెంబర్లు గాండ్ల రాజేశ్, రియాజ్, తోట గంగాధర్, బూసం కిట్టు, ఫయాజ్ మజార్, హరిసాగర్ పాల్గొన్నారు.
ప్రశాంత్‌రెడ్డిని మరోసారి ఆశీర్వదించండి
మోర్తాడ్, సెప్టెంబర్15: మండలంలోని అన్ని గ్రామాల్లో బీఆర్ఎస్ శ్రేణులు ఇంటింటి ప్రచారం చేపట్టారు. ఇంటింటికీ వెళ్లి రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు, మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి చేసిన అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించిన కరపత్రాలను అందజేశారు. మరోసారి మంత్రి ప్రశాంత్రెడ్డిను ఆశీర్వదించాలని కోరారు. కార్యక్రమంలో ఎంపీపీ శివలింగు శ్రీనివాస్, జడ్పీటీసీ బద్దం రవి, పార్టీ మండల అధ్యక్షుడు ఏలియా, మార్కెట్ కమిటీ వైస్‌చైర్మన్ పాపాయి పవన్, సర్పంచులు, ఎంపీటీసీలు తదితరులు పాల్గొన్నారు.
ఇంటింటికీ సంక్షేమ ఫలాలు
ఏర్గట్ల, సెప్టెంబర్15: మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి సహకారంతో మండలంలోని అన్ని గ్రామాల్లో ఇంటింటికీ సంక్షేమ ఫలాలు అందుతున్నాయని ఎంపీపీ కొలిప్యాక ఉపేందర్‌రెడ్డి, జడ్పీటీసీ సభ్యుడు గుల్లె రాజేశ్వర్, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు ఎనుగందుల రాజపూర్ణానందం అన్నారు. బట్టాపూర్ గ్రామంలో పార్టీ జెండాను ఎగుర వేసి ఇంటింటి ప్రచారాన్ని ప్రారంభించారు. సీఎం కేసీఆర్ ప్రజల సంక్షేమం కోసం ప్రవేశ పెడుతున్న సంక్షేమ పథకాలు, మంత్రి వేముల చేస్తున్న అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాలతో కూడిన స్టికర్లను ప్రతి ఇంటికీ అతికిస్తూ ప్రజలకు వివరించారు. కార్యక్రమంలో పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడు కూతురు చిన్నసాయన్న, రైతు బంధు సమితి జిల్లా సభ్యుడు లింగారెడ్డి, మండల అధ్యక్షుడు సున్నపు అంజయ్య, పార్టీ ఎస్టీ సెల్ మండల అధ్యక్షుడు మూడ్ గంగారాం నాయక్, సర్పంచ్, ఉప సర్పంచులు, పార్టీ నాయకులు పాల్గొన్నారు.