Nizamabad | పోతంగల్ జనవరి 10 : మత్స్యకారులు ఉపాధి కోసమే ప్రభుత్వం చేప పిల్లల పంపిణీ చేస్తున్నట్లు స్థానిక నాయకులు తెలిపారు. పోతంగల్ మండల కేంద్రంలోని పెద్ద చెరువు, ఊర చెరువు లలో గ్రామ సర్పంచ్ కల్లూరి సంధ్య హన్మండ్లు, స్థానిక నాయకులతో కలిసి చేప పిల్లలు విడుదల చేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడారు.
చేప పిల్లల పంపిణీలో భాగంగా గ్రామంలోని చెరువులలో 1.32 వేల చేప పిల్లలు విడుదల చేసినట్లు తెలిపారు. దీంట్లో రావట, బొచ్చ, మీరుగం వంటి రకాలు విడుదల చేసినట్లు తెలిపారు. చేప పిల్లలు పెరిగి పెద్దయ్యాక మత్స్యకారులు ఉపాధి పొందవచ్చన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ కల్లూరు సంధ్య, మత్స్యశాఖ సిబ్బంది జానకీ, నరేందర్, స్థానిక నాయకులు వర్ని శంకర్, గంట్ల విఠల్, రాజు, దత్తు, మన్సూర్, అనిల్, సంతోష్, బుమయ్య, శివ తదితరులు పాల్గొన్నారు.