రెంజల్ సెప్టెంబర్ 02 : నిజమాబాద్ జిల్లా రెంజల్ మండలంలోని కందకుర్తి పేపర్ మిల్, బోధన్ మండలం హంగిర్గా గ్రామాల పేద ప్రజలు వరద నీట మునిగి నిరాశ్రుయులైన కుటుంబాలకు ఎంఐఎం పార్టీ తరఫున తమ వంతు సాయం అందించేందుకు ముందుకు వచ్చింది. బాధిత కుటుంబాలకు అండగా ఉంటామని ధైర్యాన్ని అందించారు.
తమ వంతు బాధ్యతగా తీసుకొని 300 మంది కుటుంబాలకు సరిపడా వంట సరుకులను అందిస్తున్నారు. ఎంఐఎం బోధన్ టౌన్ అధ్యక్షుడు మీర్ ఇలియాస్ అలీ తన సొంత ఖర్చుతో వంట సరుకులను అందజేశారు. ఈ కార్యక్రమంలో సంయుక్త కార్యదర్శి హాజీ బిల్డర్, జిల్లా ప్రధాన కార్యదర్శి సమీ సాబ్, జమీయత్ ఉల్మా మండల అధ్యక్షుడు మీర్జా అఫ్జల్ బేగ్, ఎంఐఎం మండల కార్యకర్తలు షోయబ్ బేగ్, మోబిన్ ఖాన్, అస రార్ ఖాన్ తదితరులు ఉన్నారు.