హైదరాబాద్, మార్చి 3 (నమస్తే తెలంగాణ): కాళేశ్వరం ప్రాజెక్టులో భా గమైన మేడిగడ్డ రిజర్వాయర్ పిల్లర్ కుంగుబాటుపై విచారణకు జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ఏర్పాటును సవాలు చేస్తూ బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి హరీశ్‌రావు, ఐఏఎస్ అధికారి స్మితా సభర్వాల్, రిటై ర్డ్ ఐఏఎస్ అధికారి ఎస్కే జోషి పిటిషన్లపై మంగళవారం హైకోర్టులో వాదనలు జరిగాయి. అనంతరం కమిషన్ నివేదిక ఆధారంగా పిటిషనర్లపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని గతంలో జారీచేసిన మధ్యంతర ఉత్తర్వులను పొడిగిస్తున్నట్టు చెప్పిన జస్టిస్ చీఫ్ జస్టిస్ అపరేశ్ కుమార్‌సింగ్, జస్టి స్ జీఎం మొహియుద్దీన్ ధర్మాసనం.. తదుపరి విచారణను గురువారానికి వాయిదా వేసింది.
కేకే కుమారుడికి హైకోర్టులో ఊరట ; రఘువీర్‌రెడ్డిపై కేసు కొట్టివేతకు నిరాకరణ
హైదరాబాద్, మార్చి 3 (నమస్తే తెలంగాణ): మాజీ ఎంపీ కే కేశవరావు కుమారుడు వెంకటేశ్వర్రావు ఫిర్యాదు ఆధారంగా తనపై బంజారాహిల్స్ పోలీసులు నమోదు చేసిన కేసును కొట్టేయాలని కోరుతూ సిద్దిపేట జిల్లా కొండపాకకు చెందిన జీ రఘువీర్‌రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు డిస్మిస్ చేసింది. పోలీసులు నమోదు చేసిన కేసులో వాస్తవాలు తేలాలంటే దర్యాప్తు జరగాలని, ఈ నేపథ్యంలో పిటిషనర్ అభ్యర్థనను ఆమోదించలేమని తేల్చిచెప్పారు.