భీమదేవరపల్లిలో ఆదిమ ఆనవాళ్లు
హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలంలోని పలు గ్రామాల్లో ఆదిమ మానవుడి ఆనవాళ్లు బయటపడ్డాయి. ముల్కనూరులోని సమ్మక్క-సారలమ్మ గద్దె సమీపంలో, శ్మశాన వాటిక సమీపంలో, కొత్తకొండలోని వద్ది గుట్ట వద్ద పరుపు బండలపై ననీన శిలాయుగపు ఆదిమ మానవుల ఆనవాళ్లు ఉన్నాయి.
భీమదేవరపల్లి, ఆగస్టు 9 : హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలంలోని పలు గ్రామాల్లో ఆదిమ మానవుడి ఆనవాళ్లు బయటపడ్డాయి. ముల్కనూరులోని సమ్మక్క-సారలమ్మ గద్దె సమీపంలో, శ్మశాన వాటిక సమీపంలో, కొత్తకొండలోని వద్ది గుట్ట వద్ద పరుపు బండలపై ననీన శిలాయుగపు ఆదిమ మానవుల ఆనవాళ్లు ఉన్నాయి. పరుపు బండలపై ఆదిమ మానవుడు ఉపయోగించిన నూరుడు గుంతలు కనిపిస్తున్నాయి. రాతి గొడ్డళ్లను పదును చేసుకోవడం వల్ల ఈ గుంతలు ఏర్పడుతాయి. వీటిని పురావస్తు పరిభాషలో గ్రూవ్స్ అంటారు.
ఇనుపరాతి యుగానికి ముందు మానవుడు రాళ్లతోనే గొడ్డళ్లు, కత్తి వంటి ఆయుధాలను తయారు చేసుకున్నారు. ఈ ప్రాంతంలో పెద్ద ఎత్తున నూరుడు గుంతలు ఉండటంతో ఇక్కడ పెద్ద ఎత్తున రాతి పరికరాల కర్మాగారానికి కేంద్రంగా ఉండేదని కొత్త తెలంగాణ చరిత్ర బృందం సభ్యులు ప్రతాప్, సిద్దమల్ల రమేశ్ తెలిపారు. చారిత్రక ఆనవాళ్లు కలిగిన ఈ పరుపు బండలు ధ్వంసం కాకుండా రక్షణ చర్యలు తీసుకోవాలని వారు ప్రభుత్వాన్ని కోరారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Hanumakonda | అసమాన ప్రతిభతో ‘ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్’లో చోటు.. చిన్నారిని అభినందించిన స్కూల్ యాజమాన్యం..!
IND vs WI | చితక్కొట్టిన శాంసన్, తిలక్, అయ్యర్.. రాంచీలో విండీస్ ముందు కొండంత లక్ష్యం..!
Pregnancy | గర్భం కోసం ప్రయత్నిస్తున్న మహిళలు.. ఎప్పుడు ఫెర్టిలిటీ నిపుణులని కలవాలి..?
Students Appeal | ‘మాబడిలో హిందీ టీచర్ లేరు.. కలెక్టర్‌కు చెప్పి మూడు నెలలైనా నియమించలే’..!
Newlywed Couple’s Bodies | కాళ్లకు గొలుసులతో.. నదిలో నూతన దంపతుల మృతదేహాలు
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

