నవీపేట, డిసెంబర్ 22: మండల కేంద్రంలోని రెవెన్యూ కార్యాలయ ఆవరణలో గురువారం క్రైస్తవులకు క్రిస్మస్ కానుకలను ఎంపీపీ సంగెం శ్రీనివాస్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎంపీపీ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం సర్వ మతాలకు ప్రాధాన్యం ఇస్తోందని గుర్తు చేశారు.
కార్యక్రమంలో ఎంపీటీసీ మీనా నవీన్‌రాజ్, బీఆర్ఎస్ నాయకులు తెడ్డు పోశెట్టి, నవీపేట సొసైటీ వైస్ చైర్మన్ దొంత ప్రవీణ్‌కుమార్, ఉప సర్పంచ్ కరిపె మల్లేశ్, ఎంపీడీవో సయ్యద్ సాజీద్ అలీ, డిప్యూటీ తహసీల్దార్ సవాయ్సింగ్, రెవెన్యూ ఇన్స్పెక్టర్ మోహన్, ఎంపీవో రామకృష్ణ, పాస్టర్లు నేహమ్యా, రమేశ్, గంగారాం, ఆయా గ్రామాలకు చెందిన క్రైస్తవులు పాల్గొన్నారు.