ధరణి రైతుల భూములకు రక్షణ కవచం. రైతుబంధుకు ప్రయోజనకారి. సీఎం కేసీఆర్ తీసుకువచ్చిన ధరణి పోర్టల్‌తోనే రైతుల భూములు సేఫ్‌గా ఉంటున్నాయి. అలాంటి ధరణి పోర్టల్‌ను కాంగ్రెస్ నేతలు తీసేస్తామని చెబుతూ దళారీ వ్యవస్థకు స్వాగతం పలకాలని చూస్తున్నారు. ఒకవేళ ధరణిని తీసివేస్తే మళ్లీ పాతకాలపు రోజులే వస్తాయి. ఒకవైపు భూములను కాపాడుకోవడానికి, మరోవైపు వ్యవసాయం చేయడానికి రైతులు పాట్లుపడాల్సిన పరిస్థితి వస్తుంది. సొంత భూమిని కాపాడుకోవడానికి చేయి తడపడం తప్పదు. కాంగ్రెసోళ్లు చెబుతున్నట్లు పటేల్ , పట్వారీ వ్యవస్థ వస్తే రికార్డులన్నీ అస్తవ్యస్తమవుతాయి. ఒకరి పేరు మీద భూమి, మరొకరి పేర్ల మీదకు మారుతుంది. దళారులదే రాజ్యమవుతుంది. రైతుల మధ్య గొడవలు, ఘర్షణలు మొదలవుతాయి. పోలీసు స్టేషన్, కోర్టుల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి ఎదురవుతుంది. ఇలాంటి పరిస్థితి తేవాలనుకుంటున్న కాంగ్రెస్‌కు ఓటేస్తే మా పరిస్థితి ఏంటని రైతులు ఆందోళన చెందుతున్నారు. కవచంలాంటి ధరణి పోర్టల్‌తో మా భూములకు రక్షణగా నిలిచిన సీఎం కేసీఆర్‌తోనే మేలు చేకూరుతుందని అభిప్రాయపడుతున్నారు. మాయమాటలకు మోసపోమని, ఆగమాగం ఓటేసి కాంగ్రెస్‌ను అధికారంలోకి రానివ్వమని స్పష్టం చేస్తున్నారు. ధరణిని తీసుకొచ్చిన సీఎం కేసీఆర్‌నే మళ్లీ సీఎంను చేస్తామని తేల్చిచెబుతున్నారు.
ధరణితో మా భూములకు భద్రత ఏర్పడింది. గతంలో ఒకరి భూములు మరొకరికి మారుస్తూ వాటిని మళ్లీ మా పేరు మార్చుకోవడం కోసం చాలా ఇబ్బందులు పడ్డాం. అధికారుల చుట్టూ తిరిగితిరిగి అలసిపోయాం. ఇప్పుడు ఆ సమస్యకు సీఎం కేసీఆర్ తెచ్చిన ధరణితో చెల్లుచీటి పడింది. ఒక్కసారి ధరణిలో నమోదైన భూములను మార్చడం ఎవరి తరం కాదు. అలాంటి ధరణిని తొలగిస్తామని కాంగ్రెసోళ్లు అనడం సిగ్గుచేటు. అలా చేస్తే రైతుల భూములకు రెక్కలు వచ్చినట్లే. మరోసారి రైతులు మోసపోవడం ఖాయం.
రైతులు ప్రశాంతంగా వ్యవసాయం చేయడం కాంగ్రెస్ నాయకులకు ఇష్టం ఉండదు కావొచ్చు. అందుకే సీఎం కేసీఆర్ ప్రభుత్వం ధరణి పోర్టల్‌తో రైతుల భూ వివరాలను పకడ్బందీగా నమోదు చేసి భూములకు భద్రత కల్పించింది. అలాంటి దానిని ఇప్పుడు కాంగ్రెసోళ్లు తీసేస్తాం అనడం అర్థం కావడం లేదు. మేము సుఖంగా వ్యవసాయం చేసుకోవడం కాంగ్రెసోళ్లకు నచ్చట్లేదు. మరోసారి గిట్ల కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రైతులు పీకల్లోతు కష్టాల్లోకి వెళ్తారు.
ఇంతకు మునుపు పొలాలు అమ్మాలంటే నెలల తరబడి రిజిస్ట్రేషన్ కార్యాలయం, తహసీల్ కార్యాలయం చుట్టూ తిరగాల్సి వచ్చేది. పట్టా మార్పిడికి ఆఫీసుల చుట్టూ తిరిగినా పని అయ్యేది కాదు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. నిమిషాల వ్యవధిలో పట్టాతోపాటు ఆన్లైన్లో యజమానుల పేర్లు మారుతున్నాయి. ఇంత మంచి వ్యవస్థ అయిన ధరణిని రద్దు చేస్తామనడం మంచి పద్ధతి కాదు. రైతులు ఇలాంటి విషయాల్లో తీవ్ర ఆందోళనకు గురవుతారు.
కాంగ్రెస్ వస్తే ధరణి పోర్టల్‌ను రద్దు చేస్తామనడం విడ్డూరంగా ఉన్నది. గతంలో రైతులు పడిన కష్టాలు మళ్లీ వస్తాయి. కాంగ్రెస్ తెచ్చే భూమాత పోర్టల్‌తో తగాదాలు, కొట్లాటలు పెరుగుతాయి. రికార్డుల్లో పేర్లు మార్పులు, చేర్పులతో గొడవలు మొదలవుతాయి. ధరణి పోర్టల్ రద్దుతో మళ్లీ దళారులు పెరుగుతారు. సీఎం కేసీఆర్ ధరణి పోర్టల్ తెచ్చిన తర్వాత భూసమస్యలు తగ్గిపోయాయి. రైతులకు ఆఫీసుల చుట్టూ తిరిగే సమస్య ఉండదు.
మేము మొన్న కొన్న భూమిని రిజిస్ట్రేషన్ చేసుకున్నాం. రిజిస్ట్రేషన్ కోసం మా ఊరిలోని తహసీల్ ఆఫీస్‌కు వెళ్లాం.. వెళ్లిన అరగంటలోనే తమ పేరు మీది భూమి రిజిస్ట్రేషన్ చేసుకొని బయటికి వచ్చాం. ఇంత సౌలత్ ఉన్న ధరణితో మా కష్టాలు తీరాయి. గతంలో రిజిస్ట్రేషన్ కోసం భీమ్‌గల్ వెళ్లేవారిమి. మా ఊరిలోనే రిజిస్ట్రేషన్ సౌకర్యం కలగడం ఎంతో సంతోషంగా ఉన్నది.
ముఖ్యమంత్రి కేసీఆర్ రైతుల కష్టాలు తెలుసుకొని ధరణి ఎప్పుడైతే ప్రారంభించారో అప్పటి నుండి రైతుల కష్టాలు తీరాయి. ధరణి లేనప్పుడు ఆఫీసుల చుట్టూ తిరిగితిరిగి ఇబ్బందులు పడ్డాం. కాంగ్రెసోళ్లు వస్తే ధరణి తీసివేస్తామని అంటున్నారు. ధరణి తీసివేస్తే మళ్లీ పాత కష్టాలు వస్తాయి. కాంగ్రెసోళ్లు అధికారంలోకి రాకుంటేనే బెటర్.
గతంలో యజమానుల పేర్లు మార్చాలంటే దళారులను పట్టుకొని అధికారుల చుట్టూ తిరిగి డబ్బులు పెట్టుకొని పనులు చేసుకునేవాళ్లం. ఇప్పుడు ధరణి రాకతో ఆన్లైన్లో నమోదు చేసుకొని తహసీల్ ఆఫీస్‌కు పోతే నిమిషాల్లో దళారులు లేకుండానే పనులు పూర్తి చేసుకొని వస్తున్నాం. కాంగ్రెసోళ్లు మళ్లీ అధికారంలోకి వస్తే ధరణి తీసేస్తాం అంటున్నారు. వాళ్లు అధికారంలోకి వస్తే మళ్లీ పాత రోజులే వస్తాయి. కాంగ్రెసోళ్లకు రైతులను వేధించడం తప్ప మరొకటి రాదు.
రైతులకు భూముల విషయంలో ధరణే మంచిది. గతంలో రైతుల భూ రికార్డులు మొత్తం పట్వారీల దగ్గర ఉండేది. డబ్బులిస్తే ఒకరి భూమిని ఇంకొకరికి రాసేవాళ్లు. కానీ కేసీఆర్ సార్ సీఎం అయ్యాక ధరణి తీసుకవచ్చిండు. ధరణితో పైసలు తక్కువైనయ్. పట్టాదారులు వెళ్లి వేలిముద్ర పెట్టనిదే భూమి రికార్డుల్లో పేర్లు మారవు. కాంగ్రెసోళ్ల మాటలు నమ్మితే మళ్లీ భూముల విషయంలో గోస పడకతప్పదు.
సీఎం కేసీఆర్ ధరణి పోర్టల్‌ను తీసుకువచ్చి మా భూములకు భద్రత కల్పించారు. గతంలో పటేల్, పట్వారీ వ్యవస్థతో దొంగ రిజిస్ట్రేషన్లు చేశారు. రికార్డులను గోల్మాల్ చేసి రైతులను మోసం చేసేవారు. రోజుల తరబడి ఆఫీసుల చుట్టూ తిరిగినా పనులు అయ్యేవికావు. ధరణి వచ్చిన తర్వాత రూపాయి లంచం లేకుండా సమయం వృథా కాకుండా పనులు అవుతున్నాయి. కాంగ్రెస్ మాటలు నమ్మితే మనల్ని నట్టేట ముంచుతారు.
కాంగ్రెస్ చేస్తున్న వ్యాఖ్యలు రైతులను ఇబ్బందులకు గురిచేసేలా ఉన్నాయి. రైతులకు ఎంతో సౌలభ్యంగా మారిన ధరణి పోర్టల్‌ను కాంగ్రెస్ అధికారంలోకి రాగానే రద్దు చేస్తామని చెప్పడం వారి మూర్ఖపు ఆలోచన. గతంలోలాగా మధ్యవర్తిత్వం, రిజిస్ట్రేషన్ కార్యాలయం, దస్తావేజులేఖరుల చుట్టూ తిరిగే పనిలేకుండా పోయింది. భూముల క్రయవిక్రయాల్లో అమ్మకందారులు, కొనుగోలుదారులకు పూర్తిస్థాయిలో పట్టాల మార్పిడితోపాటు పూర్తి హక్కులు క్షణాల్లో పొందుతున్నాం. ఏండ్లుగా ఉన్న పెండింగ్ సమస్యలకు పరిష్కారం కేవలం ‘ధరణి’తో లభించింది. ఇలాంటి ధరణిని రద్దు చేస్తామని చెప్పడం కాంగ్రెస్ నేతల మూర్ఖత్వం.