DGP Shivdhar Reddy | వినాయక నగర్, జనవరి 23 : తెలంగాణ రాష్ట్ర డైరెక్టర్ జనరల్ పోలీస్ శివధర్ రెడ్డి శుక్రవారం నిజామాబాద్ జిల్లాకు విచ్చేశారు. ఐజీ చంద్రశేఖర్ రెడ్డి తో కలిసి జిల్లా కేంద్రానికి చేరుకున్న ఆయన పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం పోలీస్ కమిషనర్ సాయి చైతన్య డీజీపీకి స్వాగతం పలికారు.
కంటేశ్వర్ ప్రాంతంలో నిజామాబాద్ రూరల్ పోలీస్ స్టేషన్ కోసం నిర్మించిన నూతన భవనాన్ని డీజీపీ ప్రారంభించారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ, సుదర్శన్ రెడ్డి, నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి, సీపీ సాయి చైతన్య ఇతర శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.