దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఆదివారం జగన్మాతను కుష్మాండ దేవి, అన్నపూర్ణా దేవి, లలితా త్రిపుర సుందరి దేవీగా అలంకరించారు. ప్రత్యేక పూజలు నిర్వహించి, ధూపదీప నైవేద్యాలు సమర్పించారు.
పలు ఆలయాల్లో దుర్గామాతను కుంకుమార్చనలు, పంచామృతాభిషేకాలతో పూజించారు. దేవీ మండపాల వద్ద మహిళలు కోలాటాలు, భజనలు చేస్తూ ఆధ్యాత్మికతను చాటుతున్నారు.