జిల్లాలో ఈ నెల 15 నుంచి ప్రారంభమైన దేవీ శరన్నవరాత్రి వేడుకలు విజయ దశమితో ముగిశాయి. మండపాల్లో ఏర్పాటు చేసిన అమ్మవారి విగ్రహాలకు మంగళవారం ఉత్తరపూజలు నిర్వహించి నిమజ్జనానికి తరలించారు. జిల్లా కేంద్రంలో దేవీ శోభాయాత్ర నిర్వహించి బాసర గోదావరి నదిలో నిమజ్జనం చేశారు. మహిళలు మంగళహారతులతో తరలివచ్చి అమ్మవారికి వీడ్కోలు పలికారు. భవానీ మాలదారులు దీక్షలను విరమించారు. జిల్లా కేంద్రంలో అందంగా అలంకరించిన మండపాల్లో వివిధ రూపాల్లో అమ్మవారి విగ్రహాలు ఆకట్టుకున్నాయి.