ఎల్లారెడ్డి రూరల్/ బాన్సువాడ/ నస్రుల్లాబాద్, నవంబర్ 2: రైతన్నను వర్షం వెంటాడుతూనే ఉన్నది. మొంథా తుపాను ప్రభావంతో ఉమ్మడి జిల్లాలోని పలు ప్రాంతాల్లో గురు, శుక్రవారాల్లో వర్షం కురిసింది. దీంతో రైతులు ఆరబోసిన ధాన్యం తడిసి ముద్దయ్యింది. శనివారం కొంత ఎండ రావడంతో రైతులు ధాన్యం ఆరబోసే పనిలో నిమగ్నమయ్యారు. ఆదివారం కూడా ఎండ రావడంతో రైతులు సంతోషించారు. కానీ ఒకేసారి వాతావరణంలో మార్పులు చోటుచేసుకున్నాయి. ఆరగంట పాటు వర్షం ఏకధాటిగా కురియడంతో ఆరబెట్టిన ధాన్యం మరోసారి తడిసి ముద్దయ్యింది.
దీంతో రైతులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. కొనుగోలు కేంద్రాల్లో టార్పాలిన్లు అందుబాటులో లేకపోవడంతో ధాన్యం తడిసిపోతున్నదని రైతులు అంటున్నారు. ఎల్లారెడ్డి మండలం జాన్కంపల్లి కుర్దూలోని కొనుగోలు కేంద్రంలో ధాన్యం తడిసిం ది. బాన్సువాడ డివిజన్ కేంద్రంలో ఆదివారం మ ధ్యాహ్నం భారీ వర్షం కురిసింది. ఒక్కసారిగా కురిసిన వర్షంతో కల్లాల్లో ఉన్న ధాన్యం కండ్ల ముందే తడుస్తుండడంతో రైతులు ఆందోళన చెందారు. కో తలు ముమ్మరంగా సాగడం.. ధాన్యం ఆరబెట్టేందుకు స్థలం లేకపోవడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. బీర్కూర్ మండలం అన్నారం గ్రా మంలో ధాన్యం పూర్తిగా తడిసింది. ఆరబెట్టిన ధాన్యం వర్షానికి తడువగా రైతులు విలపిస్తున్నారు.