CP Sai Chaitanya | రెంజల్, జూన్ 17 : రేంజర్ పోలీస్ స్టేషన్ ను సీపీ సాయి చైతన్య మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. పలు రికార్డులను పరిశీలించారు. ప్రజలు సైబర్ నేరాల బారిన పడి మోసపోకుండా అప్రమత్తంగా ఉండాలని సీపీ సూచించారు. ఇందుకు ప్రజల్లో అవగాహన కల్పించాలని చెప్పారు. సిబ్బంది వీధుల పట్ల అంకితభావంతో పనిచేయాలని ఆదేశించారు.
గంజాయి నిర్మూలనకు పట్టిష్టమైన నిఘా ఏర్పాటు చేసినట్లు సీపీ తెలిపారు. స్థానిక ఎన్నికల నేపథ్యంలోసమసాత్మక, అతి సమస్యత్మక గ్రామాలపై ప్రత్యేక ఏర్పాటు చేస్తున్నామని సీపీ వెల్లడించారు. ఏసీపీ శ్రీనివాస్, బోధన్ రూరల్ సీఐ విజయ్ బాబు, ఎస్ఐ కే చంద్ర మోహన్ ఉన్నారు.