Peddakodapagal | పెద్ద కొడప్ గల్, జూలై 4 : ప్రభుత్వ నిబంధనల ప్రకారమే నిర్మాణాలు చేపట్టాలని పెద్దకొడప్గల్ హౌసింగ్ ఏఈ జ్యోతి, ఎంపీవో లక్ష్మీకాంత్‌రెడ్డి సూచించారు. కామారెడ్డి జిల్లా పెద్ద కొడప్ గల్ మండలంలోని కాస్లాబాద్ గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులను పలువురు అధికారులతో శనివారం వారు పరిశీలించారు. హౌసింగ్ ఏఈ జ్యోతి, గ్రామ కార్యదర్శి శివాజీతో కలిసి వారు నిర్మాణ పనుల పురోగతిని పరిశీలించి, ప్రభుత్వం నిర్దేశించిన కొలతలు, నాణ్యతా ప్రమాణాలకు అనుగుణంగా ఇళ్ల నిర్మాణం చేపట్టాలని లబ్ధిదారులకు సూచించారు.
అనంతరం గ్రామంలో కొనసాగుతున్న IHHL సర్వేను పరిశీలించి సంబంధిత వివరాలను ఆరా తీశారు. అలాగే కంపోస్టు షెడ్‌ను తనిఖీ చేసి, నిర్వహణ మెరుగుపరిచేందుకు అవసరమైన సూచనలు జారీ చేశారు. ప్రభుత్వ పథకాల అమలులో ఎలాంటి నిర్లక్ష్యం లేకుండా అధికారులు, సిబ్బంది సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో హౌసింగ్ ఏఈ జ్యోతి, గ్రామ కార్యదర్శి శివాజీతో పాటు సంబంధిత సిబ్బంది పాల్గొన్నారు.