Dragon | టాలీవుడ్ స్టార్ యాక్టర్ జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR) అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న చిత్రాల్లో ఒకటి డ్రాగన్ (Dragon) . ప్రశాంత్ నీల్ డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీలో రుక్మిణి వసంత్ ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తోంది. ఇప్పటికే విడుదల చేసిన గ్లింప్స్ ఇప్పటికే నెట్టింట హైప్ క్రియేట్ చేస్తోంది. స్టైలిష్ అవుట్‌ఫిట్‌లో బూట్‌కట్ ట్రౌజర్స్ వేసుకున్న జూనియర్ ఎన్టీఆర్ చేతిలో పదునైనా ఆయుధాన్ని పట్టుకోగా.. చుట్టూ మంటలు, పొగను చూడొచ్చు. మోకాళ్లపై కూర్చొని యాక్షన్ ప్యాక్డ్ లుక్‌లో కనిపిస్తూ ఫ్యాన్స్‌ను ఖుషీ చేస్తున్నాడు.
తాజాగా తారక్ ఫ్యాన్స్ కోసం అదిరిపోయే వార్త ఒకటి ఫిలింనగర్ సర్కిల్లో రౌండప్ చేస్తోంది. లేటెస్ట్ టాక్ ప్రకారం ఎన్టీఆర్ అండ్ టీం రామోజీ ఫిలింసిటీలో ఉంది. యూరోపియన్ స్టైల్ బ్యాక్‌డ్రాప్‌లో వేసిన ప్రత్యేక సెట్లో కీలక యాక్షన్ ఎపిసోడ్‌ను షూట్ చేస్తున్నారన్న వార్త నెట్టింట రౌండప్ చేస్తోంది. తాజా సమాచారం ప్రకారం ఈ షెడ్యూల్లో ఎన్టీఆర్‌పై వచ్చే కొన్ని హై ఓల్టేజ్ యాక్షన్ సీక్వెన్స్‌లను తెరకెక్కిస్తున్నారు. ఈ సెట్ యూరోపియన్ వాతావరణాన్ని రీక్రియేట్ చేసేలా విజువల్ అప్పీరియన్స్ సినిమాలో కనిపించబోతుదంట.
తాజా సీక్వెన్స్ డ్రాగన్ సినిమాకు వన్ ఆఫ్ ది మేజర్ హైలెట్స్‌లో ఒకటిగా నిలువడం పక్కానట. జక్కన్న తర్వాత ప్రశాంత్‌నీల్ ఈ సారి ఎన్టీఆర్‌తో గ్లోబల్ బాక్సాఫీస్‌ను మరోసారి బద్దలు కొట్టించడం గ్యారంటీ అని తాజా అప్డేట్ చెప్పకనే చెప్పేస్తుంది. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని ఎన్టీఆర్ ఆర్ట్స్ కో ప్రొడ్యూస్ చేస్తోంది. కేజీఎఫ్ ఫేం రవి బస్రూర్ మ్యూజిక్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందిస్తున్నాడు.