Kotagiri | కాంగ్రెస్ మోసాన్ని ప్రజల్లో ఎండగట్టాలి.. బీఆర్ఎస్
ఎన్నికల్లో హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను పూర్తిగా విస్మరించిందని, కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన మోసాన్ని ప్రజల్లో ఎండగడదామని కోటగిరి మండల బీఆర్ఎస్ నాయకులు మోరే కిషన్ తెల్ల రవికుమార్ అన్నారు.
- కోటగిరిలో కాంగ్రెస్ బాకీ కార్డు ఆవిష్కరణ చేసిన బీఆర్ఎస్ నాయకులు
Kotagiri | కోటగిరి, సెప్టెంబర్ 1 : ఎన్నికల్లో హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను పూర్తిగా విస్మరించిందని, కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన మోసాన్ని ప్రజల్లో ఎండగడదామని కోటగిరి మండల బీఆర్ఎస్ నాయకులు మోరే కిషన్ తెల్ల రవికుమార్ అన్నారు. నిజామాబాద్ జిల్లా కోటగిరి మండల కేంద్రంలో కాంగ్రెస్ బాకీ కార్డులను మంగళవారం ఆవిష్కరణ చేశారు. కాంగ్రెస్ 2023లో ఓట్ల కోసం ప్రజలకు 420 హామీలు ఇచ్చిందని ఇప్పటివరకు ఒక్క హామీని కూడా అమలు చేయలేదని ఆరోపించారు.
వెయ్యి రోజుల కాంగ్రెస్ పాలనలో తెలంగాణ ప్రజలకు జరిగిన అన్యాయం పట్ల ప్రజలకు అవగాహన కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను ప్రస్తుతం ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల పట్ల కాంగ్రెస్ ప్రభుత్వానికి నిలదీయాలన్నారు. సెప్టెంబర్ 2 నుంచి వారం రోజుల పాటు మండలంలోని ప్రతీ గ్రామంలో ప్రతీ ఇంటింటికి వెళ్లి కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన మోసాన్ని ప్రజలకు అర్థమయ్యే విధంగా తప్పనిసరిగా వివరిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు శంకర్ గౌడ్, గంగా ప్రసాద్ గౌడ్, కప్ప సంతోష్, మోరే గౌతమ్, గగన్, వడ్ల శ్రీనివాస్ గుండప్ప, పాషా సందీప్, శివ తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Nizamabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ఎదుళ్ల నుండి డిండిని అడ్డుకోవద్దు : శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి
Zelensky: రష్యా దాడి.. 6 లక్షల మంది అంధకారంలో: జెలెన్స్కీ
SriLankan Tamil Engineer | శ్రీలంక తమిళ ఇంజినీర్కు ఊరట.. మరణశిక్షను రద్దు చేసిన సౌదీ సుప్రీంకోర్టు
Medak | మెదక్ జిల్లాలో హైవేపై లారీ బోల్తా.. 2 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్!
Mary Millben: కాక్రోచ్ జనతా పార్టీకి అమెరికా నుంచి నిధులు: సింగర్ మేరీ మిల్బెన్ ఆరోపణ
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

