హైదరాబాద్, ఆట ప్రతినిధి: హైదరాబాద్ హార్స్ షోలో యువ ఈక్వెస్ట్రియన్ ఐజా మీర్ స్వర్ణ పతకంతో మెరిసింది. చివరి రోజు, సోమవారం జరిగిన పోటీల్లో ‘క్విబెలే’ గుర్రంపై స్వారీ చేస్తూ 110115 సెం.మీ అండర్-14 షో జంపింగ్ విభాగంలో టాప్ ప్లేస్ కైవసం చేసుకున్న నాసర్ అకాడమీకి చెందిన ఐజా ఓపెన్ కేటగిరీలో రజత పతకం సాధించింది. ఇతర విభాగాల్లో వేదిక్, ప్రభ్నూర్ సింగ్ మదాన్, సెంథిల్ స్వర్ణాలు అందుకున్నారు.