హైదరాబాద్, ఆట ప్రతినిధి: సీసీఓబీ కప్ అండర్-21 ఫుట్‌బాల్ చాంపియన్‌షిప్‌ను హైదరాబాద్ గ్లోబ్ ఎఫ్‌సీ కైవసం చేసుకుంది. ఉత్కంఠగా సాగిన ఫైనల్లో గ్లోబ్ ఎఫ్‌సీ 1-0 గోల్ తేడాతో హైదరాబాద్ స్పోర్టింగ్ ఎఫ్‌సీపై విజయం సాధించింది. మ్యాచ్ 55వ నిమిషంలో ఇంతియాజ్ అహ్మద్ చేసిన ఏకైక గోల్ జట్టును విజేతగా నిలిబెట్టింది. అంతకుముందు సెమీఫైనల్లో గ్లోబ్ టీమ్ 1-0తోఆతిథ్య సీసీఓబీపై నెగ్గింది.