అంతర్రాష్ట్ర బస్సుల కోసం బస్ టెర్మినల్స్.. పొన్నం
కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్రతోపాటు ఔటర్‌రింగ్ రోడ్డు వైపు నుంచి వచ్చే బస్సులను నగరంలోకి రాకుండా టెర్మినల్స్ వరకే నడిచేలా కార్యాచరణ రూపొందిస్తున్నట్టు మంత్రి పొన్నం ప్రభాకర్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. విమానాశ్రయం వైపు వెళ్లే బస్సులు, నగరానికి వచ్చే అంతర్ జిల్లా బస్సులు కూడా అవసరాన్ని బట్టి నిర్దేశిత టెర్మినల్స్ వద్దే నిలిపి, అకడి నుంచి ప్రయాణికులను వివిధ ప్రాంతాలకు తరలించే విధంగా చర్యలు చేపడుతున్నట్టు పేర్కొన్నారు.
హైదరాబాద్, సెప్టెంబర్ 15 (నమస్తే తెలంగాణ): కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్రతోపాటు ఔటర్‌రింగ్ రోడ్డు వైపు నుంచి వచ్చే బస్సులను నగరంలోకి రాకుండా టెర్మినల్స్ వరకే నడిచేలా కార్యాచరణ రూపొందిస్తున్నట్టు మంత్రి పొన్నం ప్రభాకర్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. విమానాశ్రయం వైపు వెళ్లే బస్సులు, నగరానికి వచ్చే అంతర్ జిల్లా బస్సులు కూడా అవసరాన్ని బట్టి నిర్దేశిత టెర్మినల్స్ వద్దే నిలిపి, అకడి నుంచి ప్రయాణికులను వివిధ ప్రాంతాలకు తరలించే విధంగా చర్యలు చేపడుతున్నట్టు పేర్కొన్నారు. దీంతో నగర ప్రధాన రహదారులపై ట్రాఫిక్ ఒత్తిడి తగ్గే అవకాశం ఉన్నదని తెలిపారు. గాజులరామారం, శంషాబాద్, ఎల్బీనగర్, ఘట్కేసర్ ప్రాంతాల్లో బస్ టెర్మినల్స్ ఏర్పాటు చేసే ప్రతిపాదనలపై దృష్టి సారించామని వెల్లడించారు. ఆయా టెర్మినల్స్ నుంచి ప్రయాణికులు గమ్యస్థానాలకు సులభంగా చేరుకునేలా సిటీ బస్సులు, మెట్రో రైలు, ఎంఎంటీఎస్ సేవలను సమన్వయం చేస్తున్నట్టు పేర్కొన్నారు.
కుట్టుమిషన్ల దరఖాస్తు గడువు 30కు పొడిగింపు
బీసీ సంక్షేమశాఖ బీసీ మహిళల కోసం కుట్టుమిషన్ల పంపిణీ పథకానికి సంబంధించిన దరఖాస్తుల గడువును ఈ నెల 30 వరకు పొడిగించినట్టు మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. నియోజకవర్గానికి 1,000 చొప్పున మొత్తం 1.19 లక్షల మంది మహిళలకు ఆటోమేటిక్ కుట్టు మిషన్లను 100 శాతం సబ్సిడీపై అందిస్తున్నట్టు తెలిపారు. 30లోగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఇప్పటివరకు కుట్టుమిషన్ల కోసం రాష్ట్రవ్యాప్తంగా 3.50 లక్షల మంది మహిళలు దరఖాస్తు చేసుకున్నట్టు బీసీ సంక్షేమశాఖ వర్గాలు వెల్లడించాయి.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Jason Sanjay | సీఎం విజయ్ కొడుకు హీరోగా ఎంట్రీ?.. లైకా ప్రొడక్షన్స్‌తో చర్చలు!
Delhi Metro Stations: అక్టోబర్ 10 నిరసన నేపథ్యంలో.. 57 మెట్రో స్టేషన్లు మూసివేత !
RRB Jobs | రైల్వేలో 3548 నాన్ టెక్నికల్ గ్రాడ్యుయేట్ ఖాళీలు.. నోటిఫికేషన్ విడుదల చేసిన ఆర్ఆర్బీ
Alias Rukmini | ఆసక్తి రేపుతున్న నితిన్, నానిల ‘అలియాస్ రుక్మిణి’.. డిసెంబర్ 4న థియేటర్లలో సందడి!
Gaurav Yadav: పంజాబ్ డీజీపీగా గౌరవ్ యాదవ్ నియామకం
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

