నాంపల్లి క్రిమినల్ కోర్టులు, సెప్టెంబర్ 15 (నమస్తే తెలంగాణ): సినిమాల పైరసీ కేసులో ప్రధాన నిందితుడు, ‘ఐ-బొమ్మ’ నిర్వాహకుడు ఇమంది రవి నాంపల్లి కోర్టును ఆశ్రయించాడు. ఈ కేసులో సైబర్ క్రైమ్ పోలీసులు తన నుంచి జప్తుచేసిన రూ.3 కోట్లు వాపసు ఇవ్వాలని కోరుతూ పిటిషన్ దాఖలు చేశాడు. పోలీసులు తన బ్యాంక్ అకౌంట్లను ఫ్రీజ్ చేయడంతో కుటుంబసభ్యులను పోషించుకోవడం కష్టంగా మారిందని పేర్కొన్నాడు. ఈ పిటిషన్పై బుధవారం విచారణ జరుపనున్నట్టు 9వ అదరనపు చీఫ్ జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ కోర్టు ప్రకటించింది.