హైదరాబాద్, సెప్టెంబర్ 15 (నమస్తే తెలంగాణ): ఆంధ్రప్రదేశ్ మాజీ డిప్యూటీ సీఎం ఆళ్ల నాని (57) గుండెపోటుతో మంగళవారం విశాఖలో తుదిశ్వాస విడిచారు. 1969 డిసెంబర్ 30న పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో జన్మించిన ఆయనకు భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. 1994లో కాంగ్రెస్తో ప్రస్థానాన్ని ప్రారంభించిన నాని.. 2004లో అంబికా కృష్ణపై గెలిచి ఎమ్మెల్యే అయ్యారు. 2014లో వైసీపీ తరఫున పోటీచేసి ఓటమిపాలైన నాని.. 2017లో ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో ఏలూరు నుంచి గెలిచి జగన్ ప్రభుత్వంలో డిప్యూటీ సీఎంతోపాటు వైద్యారోగ్యశాఖ మంత్రిగా 2022 వరకు బాధ్యతలు నిర్వహించారు. 2024లో ఓటమిపాలైన నాని ఫిబ్రవరి 13న టీడీపీలో చేరారు.