కంఠేశ్వర్, జూలై 6: ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియలో భాగంగా ప్రతి ఓటరు ఎన్యూమరేషన్ పత్రాన్ని పూరిం చి, నిర్ణీత గడువులోగా తప్పనిసరిగా బూత్ లెవల్ అధికారికి అందజేయాలని నిజామాబాద్ జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఇలా త్రిపాఠి సూచించారు. సోమవారం కలెక్టరేట్లో ప్రజావాణి అనంతరం కలెక్టర్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. అన్ని శాఖల జిల్లా అధికారులు, ఉద్యోగులందరూ విధిగా ఈనెల 24 లోగా ఎన్యూమరేషన్ ఫారాలను నింపి, బీఎల్వోలకు అందించాలని సూచించారు. లేని పక్షంలో ఆగస్టు 5న ప్రచురించే ఓటర్ల ముసాయిదా జాబితాలో పేరు కోల్పోతారని కలెక్టర్ స్పష్టం చేశారు.
ఈ విషయాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ తేలికగా తీసుకోకూడదని, అధికారులు ఎంత పెద్ద హోదాలో, ఏ స్థాయిలో ఉన్నా ఎన్నికల సంఘం నిర్ధేశించిన మేరకు ఎన్యూమరేషన్ ఫారం అందించాల్సిందే అని పేర్కొన్నారు. అంకితభావంతో విధులు నిర్వర్తించే మండల స్పెషల్ ఆఫీసర్‌ను ఎంపిక చేసి తగిన ప్రో త్సాహం అందజేస్తామని తెలిపారు. సమావేశంలో అదనపు కలెక్టర్ భుజంగరావు, ట్రెయి నీ కలెక్టర్ సురేశ్, డీఆర్వో గీత, జడ్పీ సీఈవో సాయాగౌడ్, డీఆర్డీవో సాయన్న, డీపీవో శ్రీనివాస్‌రావు, ఏసీపీ ప్రకాశ్, అన్ని శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.