ఖలీల్వాడి, అక్టోబర్ 15 : జిల్లాకేంద్రంలోని జీజీ కళాశాల గ్రౌండ్లో నిర్వహించిన సీఎం కేసీఆర్ ప్రజా ఆశీర్వాద సభ విజయవంతమైంది. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. సీఎం రాకతో నగరమంతా గులాబీమయమైంది. నగరంలోని బైపాస్ రోడ్డు వద్ద సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్, ఎమ్మెల్సీ కవిత కటౌట్లు, భారీ ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు.
సభలో యువత కేసీఆర్ ఫ్లకార్డులతో కేరింతలు కొడుతూ, డ్యాన్సులు చేస్తూ సభలో సందడి చేశారు. సభా వేదికపై కళాకారుల ఆటాపాటలు ప్రజలను ఆకట్టుకున్నాయి. సీఎం కేసీఆర్ హెలికాప్టర్ సభా ప్రాంగణంలోకి రాగానే ప్రజలు కేరింతలు కొట్టారు. సీఎం సభలోకి అడుగుపెట్టగానే జై కేసీఆర్, కేసీఆర్ జిందాబాద్ నినాదాలు చేశారు.