బాన్సువాడ టౌన్, మే 11 : రాష్ట్రంలో రైతుల కోసం ప్రత్యేక అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్‌కు దక్కుతుందని రైతుబంధు సమితి కామారెడ్డి జిల్లా కన్వీనర్ అంజిరెడ్డి అన్నారు. కేసీఆర్ రైతుబంధు పథకం ప్రవేశపెట్టి ఐదేండ్లు పూర్తయిన సందర్భంగా బాన్సువాడ పరిధిలోని ధాన్యం కొనుగోలు కేం ద్రంలో గురువారం రైతులతో కలిసి కేక్ కట్ చేసి సంబురాలు చేసుకున్నారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్, స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి రైతుబిడ్డలేనని అన్నారు. రైతులను ఆదుకోవాలన్న ఉద్దేశంతోనే రైతుబంధు పథకాన్ని సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టారని అన్నారు. ఇలాంటి అద్భుతమైన పథకం దేశంలోని మరే ఇతర రాష్ట్రంలో లేదన్నారు. దేశంలో బీఆర్ఎస్ అధికారంలోకి రావడం, కేసీఆర్ ప్రధాని ఖాయమని ధీ మా వ్యక్తం చేశారు. ఆత్మకమిటీ చైర్మన్ మోహన్ నాయక్, కోఆప్షన్ సభ్యుడు బాబా, బీఆర్ఎస్ నా యకులు విఠల్‌రెడ్డి, ముఖీద్, రైతులు పాల్గొన్నారు.