రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో అత్యాధునిక వసతులతో నిర్మించిన డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సచివాలయాన్ని సీఎం కేసీఆర్ ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్‌తోపాటు మంత్రులందరూ తమ చాంబర్లలో కొలువుదీరారు. అనంతరం పలు ఫైళ్లపై సంతకాలు చేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్, రాష్ట్ర రోడ్లు-భవనాలు, గృహ నిర్మాణశాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డిని ఉమ్మడి జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులు, నాయకులు పుష్పగుచ్ఛాలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు.
శుభాకాంక్షలు తెలిపిన వారిలో సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి, జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్, నిజామాబాద్ జడ్పీ చైర్మన్ దాదన్నగారి విఠల్‌రావు, ఆర్మూర్, అర్బన్ ఎమ్మెల్యేలు ఆశన్నగారి జీవన్‌రెడ్డి, బిగాల గణేశ్‌గుప్తా, ఎమ్మెల్సీ రాజేశ్వర్, రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ ముజీబుద్దీన్, రాష్ట్ర మైనార్టీ కమిషన్ చైర్మన్ తారిఖ్ అన్సారీ, ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్, జుక్కల్ ఎమ్మెల్యే హన్మంత్ షిండే, ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్, డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ వీజీ గౌడ్, రాష్ట్ర మహిళా ఆర్థిక సహకార సంస్థ చైర్పర్సన్ ఆకుల లలిత, కామారెడ్డి జడ్పీ చైర్పర్సన్ దఫేదార్ శోభ, జడ్పీ మాజీ చైర్మన్ దఫేదార్ రాజు తదితరులు ఉన్నారు.