మాచారెడ్డి : మండలంలోని చుక్కాపూర్ అటవీ ప్రాంతంలో కొలువై ఉన్న శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి (Lakshmi Narasimha Swamy ) ఆలయంలో శనివారం హుండీలను (Hundi) లెక్కించారు. నిజామాబాద్ దేవాదాయ శాఖ సహాయకమిషనర్ విజయ రామారావు ఆధ్వర్యంలో 8 హుండీల లెక్కింపు కార్యక్రమం నిర్వహించగా అందులో రూ. 2,12, 281 వచ్చినట్లు ఆలయ ఈవో శ్రీధర్ రావు తెలిపారు. లెక్కింపులో ఆలయ అర్చకులు, సిబ్బంది , అక్కాపూర్ గ్రామానికి చెందిన సేవా సమితి మహిళా భక్తులు పాల్గొన్నారు.