Chalo Khammam | కోటగిరి, జనవరి 11 : పేద ప్రజలకు ఎల్లప్పుడూ అండగా సీపీఐ ఉంటుందనీ, 10 లక్షల ఎకరాల భూమిని పేదలకు పంచిన చరిత్ర భారత కమ్యూనిస్టు పార్టీదేనని సీపీఐ కోటగిరి మండల కార్యదర్శి విఠ ల్ గౌడ్ అన్నారు. మండలకేంద్రంలో బహిరంగ సభకు సంబంధించిన వాల్ పోస్టర్లను ఆదివారం ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈనెల 18 న ఖమ్మంలో 5 లక్షల మందితో భారీ బహిరంగ సభ చేసినట్లు చెప్పారు. ఈ కార్యక్రమానికి సీఎంతో పాటు 40 దేశాల నుంచి కమ్యూనిస్టుల ప్రతినిధులు హాజరవుతున్నారని, కావున సీపీఐ కార్యకర్తలు, కార్మికులు, రైతులు హాజరై భారీ బహిరంగ సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సోమ వీరేశం, కప్ప హన్మాండ్లు, పోశెట్టి, రాజు, నల్ల సాయిలు, లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.