వినాయక్ నగర్, ఆగస్టు 19: నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని (Nizamabad) ఓ ఏటీఎంలో చోరీకి దుండగులు విఫలయత్నం చేశారు. సోమవారం అర్ధరాత్రి దాటిన తర్వాత పట్టణంలోని చంద్రశేఖర్ కాలనీలో ఉన్న ఏటీఎం సెంటర్‌కు మారుతీ వ్యాన్‌లో వచ్చిన దుండగులు.. గ్యాస్ కట్టర్‌తో మెషిన్‌కు కట్ చేశారు. అయితే అందులోనుంచి డబ్బులు తీసేందుకు ప్రయత్నిస్తుండగా అదేసమయంలో అటువైపుగా వచ్చిన పెట్రోలింగ్ టీమ్‌ను చూసి వ్యాన్‌లో పరారయ్యారు.
దుండగులు నిర్మల్ జిల్లా బాసర వైపు పారిపోతుండగా చూసిన పెట్రోలింగ్ సిబ్బంది జిల్లావ్యాప్తంగా పోలీసులను అప్రమత్తం చేశారు. పోలీసులు తమను వెంబడిస్తున్నారని గుర్తించిన దుండగులు పాల్ద గ్రామ శివారులో వ్యానును వదిలేసి పరారయ్యారు. దీంతో మారుతి వ్యాన్‌తో పాటు అందులో ఉన్న గ్యాస్ కట్టర్లను సీజ్ చేశారు. దుండగులు ఉపయోగించిన కారు మహారాష్ట్ర రిజిస్ట్రేషన్ నంబర్ ఉండటంతో వారు మహారాష్ట్రకు చెందిన అంతరాష్ట్ర దొంగల ముఠగా పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.