Urea App | భీమ్గల్, జూన్ 15 : రైతులకు సంకటంగా మారిన యూరియా యాప్ ని తక్షణమే రద్దు చేయాలని భీమ్గల్ మండల బీఆర్ఎస్ నాయకుడు దొనకంటి నరసయ్య డిమాండ్ చేశారు. రైతులు, పార్టీ శ్రేణులతో కలిసి భీమ్గల్ మండల కేంద్రంలోని సుమంగళి చౌరస్తాలో సోమవారం రాస్తారోకో నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇది పూర్తిగా రైతు వ్యతిరేక ప్రభుత్వమని, యూరియా యాప్ వల్ల రైతులకు లేని కష్టాలను ఈ ప్రభుత్వం తెచ్చిపెట్టిందని ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే ఈ యాప్ ని రద్దుచేసి పాత పద్ధతిని కొనసాగించాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఆందోళనను మరింత ఉదృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మాజీ జడ్పీటీసీలు చౌటుపల్లి రవి, కౌన్సిలర్లు బొదిరె నరసయ్య, మల్లెల ప్రసాద్, నాయకులు రాజు నాయక్, మూత లింబాద్రి, సిద్ధపల్లి రాములు, సాగర్, తోట లింగం తదితరులు పాల్గొన్నారు.