Sirikonda | సిరికొండ, పిబ్రవరి 1 : ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కేసీఆర్కు సిట్ నోటీసులుజారీచేయడంపై బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు భగ్గుమంటున్నారు. రాజకీయ కక్షతోనే నోటీసులు జారీ చేశారంటూ మండిపడుతున్నారు. ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ ఆదివారం సిరికొండ మండల కేంద్రంలో సీఎం రేవంత్రెడ్డి దిష్టిబొమ్మలను దహనం చేశారు.
కాంగ్రెస్ పాలనపై మండల కేంద్రంతో పాటు పలు గ్రామాలలో నిరసన హోరెత్తింది. కక్షపూరిత రాజకీయాలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సిరికొండ మండల కేంద్రంలో దిష్టి బొమ్మను దహనం చేసే సమయంలో పోలీసులు అడ్డుపడి బీఆర్ఎస్ నాయకులను చెదరగొట్టారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ శాంతియుతంగా నిరసన తెలిపారు.