ఖలీల్‌వాడి/ బాన్సువాడ, ఏప్రిల్ 9: వరంగల్‌లో ఈనెల 27వ నిర్వహించనున్న బీఆర్ఎస్ రజతోత్సన సభ కోసం జిల్లావ్యాప్తంగా సన్నాహక సమావేశాలు ఏర్పాటు చేస్తున్నట్లు ఆర్టీసీ మాజీ చైర్మన్, రూరల్ మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు.
ఈనెల 15వ తేదీన రూరల్ నియోజకవర్గంలో సమావేశం ఉంటుందని పేర్కొన్నారు. నేడు(గురువారం) బాన్సువాడ, బోధన్‌లో నిర్వహించనున్న సన్నాహక సమావేశాలు వాయిదా పడినట్లు తెలిపారు. ఈ రెండు సమావేశాలను ఈనెల 16వ తేదీన నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. సన్నాహక సమావేశాలకు నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని కోరారు.