బోధన్, ఏప్రిల్ 19: తెలంగాణ రాష్ట్ర ఆకాంక్షతో బీఆర్ఎస్ పార్టీని కేసీఆర్ స్థాపించి 25 ఏండ్లు పూర్తవుతున్న సందర్భంగా వరంగల్ జిల్లా ఎల్కతుర్తిలో ఈనెల 27వ నిర్వహించనున్న రజతోత్సవ సభను పార్టీ శ్రేణులు విజయవంతం చేయాలని బోధన్ మాజీ శాసనసభ్యుడు మహ్మద్ షకీల్ అన్నారు. బోధన్ పట్టణంలోని తన స్వగృహంలో ఆయనను కలిసేందుకు శనివారం పెద్ద సంఖ్యలో వచ్చిన బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలను ఉద్దేశించి షకీల్ మాట్లాడారు.
రజతోత్సవ వేడుకల నేపథ్యంలో బోధన్ నియోజకవర్గం సన్నాహక సమావేశాన్ని నేడు(ఆదివారం) నిర్వహించనున్నట్లు తెలిపారు. బోధన్ పట్టణంలోని ఆఫ్నా ఫంక్షన్ హాల్లో ఉదయం 10 గంటలకు ప్రారంభమయ్యే ఈ సన్నాహక సమావేశానికి పెద్ద ఎత్తున నాయకులు, కార్యకర్తలు తరలిరావాలని షకీల్ సూచించారు. కార్యక్రమంలో డీసీసీబీ డైరెక్టర్ గిర్దావర్ గంగారెడ్డి, బీఆర్ఎస్ బోధన్ పట్టణ అధ్యక్షుడు రవీందర్ యాదవ్, పార్టీ వివిధ మండలాల అధ్యక్షులు సంజీవ్‌కుమార్, గోగినేని నర్సయ్య, డి.శ్రీరామ్, భూమ్‌రెడ్డి, నర్సింగ్‌రావు పాల్గొన్నారు.
బీఆర్ఎస్ రజతోత్సవ సభను ఈనెల 27వ వరంగల్ జిల్లాలో నిర్వహించనున్నారు. సభ విజయవంతం చేయడం కోసం బీఆర్ఎస్ శ్రేణులు చర్యలు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగా వాల్ పెయింటింగ్స్, పోస్టర్ల ఆవిష్కరణతోపాటు సన్నాహక సమావేశాలను నిర్వహిస్తున్నారు.
-ఎల్లారెడ్డి రూరల్, ఏప్రిల్ 19